COVID-19 Vaccine: కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌కు డీజీసీఐ గ్రీన్ సిగ్నల్
భారత్‌లో కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
COVID-19 Vaccines permission | న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ఫార్మ దిగ్గజాలు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాల అత్యవసర వినియోగానికి డీజీసీఐ షరతులతో కూడిన అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ టీకాలను అత్యవసర సమయంలో పరిమిత వినియోగానికి అనుమతిస్తున్నట్లు డీజీసీఐ చీఫ్ వీజీ సోమాని (VG Somani) వెల్లడించారు. ఈ మేరకు డీజీసీఐ చీఫ్, అధికారులతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
భద్రతాపరమైన సమస్యలుంటే.. వ్యాక్సిన్లకు ఎప్పటికీ అనుమతివ్వమని డీజీసీఐ (DGCI) చీఫ్ వీజీ సోమాని స్పష్టంచేశారు. ఈ రెండు టీకాలు 100 శాతం సురక్షితమని తెల్చిచెప్పారు. అయితే ఎలాంటి టీకా తీసుకున్నా.. బలహీనంగా ఉన్న వ్యక్తులకు తేలికపాటి జ్వరం, నొప్పి, అలెర్జీ వంటివి రావడం సర్వసాధారణమని ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటికే డ్రగ్స్ నిపుణుల కమిటీ ఈ రెండు వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తూ ఆమోదం తెలపాలని సిఫారసు సైతం చేసిన విషయం తెలిసిందే. Also read: Punjab సీఎంను చంపుతామంటూ పోస్టర్.. కేసు నమోదు
డీసీజీఐ ఆమోదంతో ఇండియాలో అందుబాటులోకి రానున్న తొలి కరోనా వ్యాక్సిన్‌లుగా కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ నిలిచాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్‌ను దేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institue of India) తయారు చేయగా.. కోవ్యాక్సిన్ (Covaxin)ను హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ (Bharat Biotech) తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ల తుది దశ ట్రయిల్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
Also Read: Heavy Rain In Delhi: దేశ రాజధానిని వణికిస్తున్న చలి, వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook