Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డ్, 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా మందికి వ్యాక్సినేషన్
Coronavirus India Latest News: కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయడం అనేది రికార్డ్. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
2 crore Covid-19 vaccine doses and counting:కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి రికార్డులు బద్దలు కొట్టింది ఇండియా. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు (PM Modi birthday)సందర్భంగా శుక్రవారం భారీఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) చేపట్టారు. బీజేపీ పిలుపు మేరకు చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, అదే మోదీకి... ఆయన పుట్టిన రోజు సందర్భంగా మనం ఇచ్చే బహుమతి అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya)పేర్కొన్నారు. దీంతో వ్యాక్సినేషన్ జోరుగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పెద్ద ఎత్తున డోసులను పంపిణీ చేశారు.
సాయంత్రానికి 2 కోట్లపైగా వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇది రాత్రి వరకు 2.5కోట్లకు పైగానే చేరనుంది. కేవలం 9 గంటల్లోపే 2 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేయడం అనేది రికార్డ్. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79కోట్లకు పైగా కోవిడ్ (Covid)డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read : Saidabad incident: రాజు ఆత్మహత్య కేసుపై విచారణకు ఆదేశించిన తెలంగాణ హై కోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook