Covid19 Alert: చిన్నారుల్లో పెరుగుతున్న కరోనా కేసులు, ఆందోళన కల్గించే పరిణామమే
Covid19 Alert: కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి దేశం నెమ్మదిగా కోలుకుంటోంది. అదే సమయంలో చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Covid19 Alert: కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి దేశం నెమ్మదిగా కోలుకుంటోంది. అదే సమయంలో చిన్నారుల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus)కేసులు తగ్గుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌తో విలవిల్లాడిన జనం నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే కరోనా మహమ్మారి అప్పుడే పూర్తిగా ముగిసినట్టు కాదని వైద్యులు చెబుతున్నారు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నా..1 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారుల్లో కరోనా యాక్టివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
చిన్నారుల్లో కరోనా యాక్టివ్ కేసులు(Coronavirus in Children) పెరుగుతున్నాయని ఎంపవర్డ్ గ్రూప్ 1 డేటా చెబుతోంది. నేషనల్ కోవిడ్ ఎమర్జెన్సీ స్ట్రాటజీలో భాగంగా ఎంపవర్డ్ గ్రూప్ 1 పని చేస్తోంది. ఈ ఏడాది మార్చ్ వరకూ ఉన్న కరోనా యాక్టివ్ కేసుల్లో 1-10 ఏళ్లలోపు వయస్సు పిల్లలు 2.80 శాతం ఉండగా..ఆగస్టు నాటికి అది 7.04 శాతానికి చేరుకుంది. అంటే ప్రతి వంద కరోనా కేసుల్లో ఏడుగురు పిల్లలే ఉంటున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ నేతృత్వాన జరిగిన సమావేశంలో ఈజీ 1 నివేదికను వెల్లడించింది. పిల్లల్లో కరోనా యాక్టివ్ కేసులకు సంబంధించి 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు చిన్నారుల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పెద్దలతో పోలిస్తే చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుందన్నారు. కరోనా మార్గదర్శకాల్ని చిన్నారులు కచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించాలంటున్నారు.
Also read: Zomato Update: జొమాటోలో కీలక పరిణామం, సీవోవో గౌరవ్ గుప్తా అవుట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook