ఇండియాలో కరోనా వైరస్ ( Coronavirus in india ) సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. రోజుకు 40-50 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 80  లక్షల మార్క్ ( India at 80 lakhs mark ) చేరువైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ సంక్రమణ ప్రభావం నుంచి ఇండియా ఇంకా కోలుకోలేదు. కరోనా వైరస్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇప్పటికీ  ప్రపంచంలో రెండవ దేశంగా నిలుస్తోంది. గత కొద్దికాలంగా భారతదేశం ( India ) లో కరోనా కేసుల సంఖ్య ( Coronavirus cases ) స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన 43 వేల 893 కొత్త కేసులతో ఇండియా కరోనా కేసులు 80 లక్షల మార్క్ కు చేరువైంది. దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 79 లక్షల 90 వేల 322కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 508 మంది మరణించగా..ఇప్పటివరకూ మృతి చెందినవారి సంఖ్య 1 లక్షా 20 వేలకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజా గణాంకాల్ని వెల్లడించింది.


దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 79 శాతం కేవలం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్నించే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.  వాస్తవానికి మిజోరం ( Mizoram ) రాష్ట్రంలో ఇప్పటివరకూ కోవిడ్ వైరస్ కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదు.  అయితే తాజాగా 62 ఏళ్ల వ్యక్తి మరణంతో తొలి కోవిడ్ 19 మరణం చోటుచేసుకుంది.


కోవిడ్ కేసులు పెరుగుతున్నా సరే..ఊరట కల్గించే అంశముందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 మరణాలు పెరుగుతున్నా.. ప్రతి పదిలక్షల జనాభాలో నమోదవుతున్న వైరస్‌ మరణాల సంఖ్యతో పోలిస్తే.. ప్రపంచంలోనే భారత్‌లో అతితక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Central Health ministry ) ప్రకటించింది.


కోవిడ్‌ వైరస్ మరణాల్లో ప్రపంచపు సగటు సంఖ్య 148 కాగా, భారత్‌లో కేవలం 87కే పరిమితమవడం​ ఊరట కలిగిస్తోంది. మరోవైపు ఇండియాలో రోజురోజుకూ కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య ( Corona active cases ) కూడా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 58 వేల 439 మంది కోలుకున్నారు. Also read: Smriti irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకు కోవిడ్ పాజిటివ్