దేశంలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారిత పరీక్షల సంఖ్య 2 కోట్లకు చేరింది. భారత్‌లో ఆదివారం వరకు 2,02,02,858 (2.02 కోట్లు) శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారిత పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సోమవారం తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 3,81,027 శాంపిల్స్ పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించింది. గత వారం రోజుల్లో నిత్యం దాదాపు 4.5 లక్షల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 11.8 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ప్రస్తుతం 5.29 లక్షల పేషెంట్లు కరోనాకు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 52,972 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, 771 కోవిడ్19 మరణాలు సంభించాయి. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,03,696 (18 లక్షలు)కు చేరింది. మొత్తం కోవిడ్19 మరణాలు 38,135కు చేరుకున్నాయి. తెలంగాణలో తాజాగా 983 కరోనా కేసులు.. 11 మంది మృతి


ప్రపంచంలో అత్యధిక మరణాలు, కేసులతో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది. కేసులలో బ్రెజిల్ తర్వాత, భారత్ మూడో స్థానంలో ఉండగా.. కోవిడ్19 మరణాలలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందట కరోనా మరణాలలో ఇటలీని భారత్ వెనక్కి నెట్టింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
అందాల ‘దేశముదురు’ హన్సిక Photos