Covid19 Vaccine: భారత్‌కు మాత్రమే ఆ సామర్ధ్యముంది
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ ను కనుగొనడంపైనే అందరి దృష్టీ నెలకొంది. ఒకవేళ పరిశోధనలు సత్ఫలితాలనందించాక పరిస్థితి ఏమిటి? మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ చుట్టేసిన నేపధ్యంలో సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఆ కంపెనీలకుందా అసలు? ఈ ప్రశ్నకు సమాధానం బిల్ గేట్స్ ( BillGates ) చెబుతున్నారు. ఒక్క భారతదేశానికే ఆ సామర్ధ్యముందంటున్నారు.
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ ను కనుగొనడంపైనే అందరి దృష్టీ నెలకొంది. ఒకవేళ పరిశోధనలు సత్ఫలితాలనందించాక పరిస్థితి ఏమిటి? మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ చుట్టేసిన నేపధ్యంలో సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఆ కంపెనీలకుందా అసలు? ఈ ప్రశ్నకు సమాధానం బిల్‌గేట్స్ ( BillGates ) చెబుతున్నారు. ఒక్క భారతదేశానికే ఆ సామర్ధ్యముందంటున్నారు.
రీసెర్చ్ పరంగా కాస్త వెనక్కి ఉన్నా..ఉత్పత్తి, మార్కెటింగ్ విషయంలో భారతదేశ ఫార్మాకు ( Indian Pharma ) మంచి పేరే ఉంది. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ రంగంలో ( Vaccine Sector ) . అందుకే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన ( Microsoft co founder ) బిల్‌గేట్స్ ఈ మాటలంటున్నారు. Also read: COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం
“ భారత్‌కు చాలా సామర్ధ్యముంది. అక్కడి డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ సరఫరా చేయగలవు. చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) చాలా పెద్దది. భారత్‌లో బయో ఈ ( Biological E ) , భారత్ బయోటెక్ ( Bharat Biotech ) కంపెనీలున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) ను రూపొందిస్తున్నాయి. అక్కడి ఫార్మా పరిశ్రమ ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు “ అంటూ దేశీయ ఫార్మా రంగంపై ప్రశంసలు కురిపించారు బిల్‌గేట్స్.
డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమైన కోవిడ్ 19 వైరస్‌పై భారత్ పోరు డాక్యుమెంటరీలో బిల్‌గేట్స్ ఈ మాటలన్నారు. వివిధ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను కోవిడ్ 19 వైరస్‌పై పోరు కోసం భారత ఫార్మా ఉపయోగించగలుగుతుందని బిల్‌గేట్స్ చెప్పారు. బిల్‌గేట్స్ ఈ మాటలు చెప్పడం అతిశయోక్తి కానేకాదు. ఎందుకంటే వ్యాక్సిన్ రంగంలో భారత్ కు అగ్రస్థానమే ఉంది. Also read: Covid-19 Vaccine: వ్యాక్సిన్ తయారీలో అమెరికా వేగం
ముఖ్యంగా వ్యాక్సిన్ రంగంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum Institute of India ) , బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌లు ప్రపంచం మొత్తానికి ఇప్పటికే సరఫరా అవుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌లలో మీజిల్స్ ( Measles ) , రుబెల్లా ( Rubella ), ఎంఎంఆర్ ( MMR ) , హెపటైటిస్ బి ( Hepatitis-B ) , రేబిస్, బీసీజీ వంటి చాలా రకాలున్నాయి. మరీ ముఖ్యంగా పూణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న వ్యాక్సిన్‌లైతే ప్రపంచంలో 70 శాతం దేశాలకు ఇవాళ్టికీ సరఫరా అవుతున్నాయి. ఓ లెక్క ప్రకారం ప్రపంచంలో వ్యాక్సిన్ పొందుతున్న చిన్న పిల్లలు ప్రతి ముగ్గురిలో ఇద్దరు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ పొందుతున్నారు. ఇంతటి ఘనత కలిగినందునే బిల్ గేట్స్ ఈ మాటలు చెప్పగలిగారు. Also read: Coronavirus: వ్యాక్సీన్ తయారీలో రష్యా విజయం సాధించిందా?
ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ) తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మాత్రమే మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ( Third phase of clinical trials ) లో ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ధృవీకరించింది. తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం, మార్కెటింగ్ చేసే బాధ్యతను భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించడానికి కారణం కూడా ఆ కంపెనీకు వ్యాక్సిన్ రంగంలో ఉన్న సమర్ధత, అనుభవమే. Also read: అమెరికాలో టిక్‌టాక్ నిషేధంపై పెరుగుతున్న ఒత్తిడి