Covisheild Vaccine Price: దేశంలో దాదాపు 3 లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాక్లిన్ల ఉత్పత్తి వేగవంతం చేశారు. మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని, వారందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) తాము ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ కరోనా టీకాల ధరలను ప్రకటించింది. కోవిషీల్డ్ టీకాలను ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక్క డోసు(Covishield Vaccine)కు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600కు ఒక్క డోసు కోవిషీల్డ్ డోసు విక్రయాలు జరపనున్నామని తెలిపారు. ఈ మేరకు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా ఓ ప్రకటన ట్విట్టర్‌లో విడుదల చేశారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలలో 50 శాతం మేర భారత ప్రభుత్వానికి అందించనుడగా, మిగతా 50 మేర టీకా ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటల్స్‌కు విక్రయించనున్నామని ప్రకటనలో తెలిపారు.


Also Read: Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, 20 మంది మృతి



దేశంలో అందుబాటులో ఉన్న విదేశీ వ్యాక్సిన్ల ధరలను పరీశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికా వ్యాక్సిన్ల ధర రూ.1500 ఉండగా, రష్యా వ్యాక్సిన్ల ధర రూ.750, చైనా టీకాలకు ఒక్క డోసుకు రూ.750 మేర విక్రయాలు జరుగుతున్నాయని తమ ప్రకటనలో ప్రస్తావించారు. టీకాల కొరత, టీకాలకు ఉన్న డిమాండ్ కారణంగా తమ విధివిధానాల ప్రకారం వ్యాక్సిన్లను అందజేయనున్నట్లు చెప్పారు. నాలుగైదు నెలల తరువాత CoronaVirus వ్యాక్సిన్లు రిటైల్ మార్కెట్‌లోకి మార్కెట్‌లో తీసుకురానున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.


గత 24 గంటల్లో దేశంలో 2 లక్షల 95 వేల 41 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 2,023 మంది మరణించారు. తాజాగా 1 లక్షా 67 వేల 457 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 57 వేల 538 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1 కోటి 56 లక్షల 16 వేల 130 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనాతో మొత్తం 1,82,553 మంది మృతి చెందారు.


Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook