Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, తాజాగా 20 మంది మృతి

Telangana Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 6,542 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కు చేరింది. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 21, 2021, 10:22 AM IST
Corona Positive Cases: తెలంగాణలో కొత్తగా 6500 పైగా కరోనా కేసులు, తాజాగా 20 మంది మృతి

Telangana Corona Positive Cases: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశలో వణికిస్తోంది. గాలి ద్వారా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 6,542 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,30,105 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 6 వేల 5 వందల నలభై రెండు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 67 వేల 9 వందల ఒకరికి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 20 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,876కి చేరింది. తెలంగాణ(Telangana) సర్కార్ కరోనా టెస్టులు సైతం పెంచింది.

Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు

తెలంగాణలో అత్యధిక కోవిడ్-19(COVID-19) పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో తాజాగా 898 కరోనా కేసులు నిర్ధారణ కావడం హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 46 వేల 488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,20,73,090 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 2,887 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,19,537 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబందనలు పాటిస్తే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చునని సూచిస్తున్నారు.

Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News