Amravati Violence: ఈశాన్య రాష్ట్రంలో చెలరేగిన పరిణామాలు మహారాష్ట్రలో (Amaravati violence) చిచ్చుపెట్టాయి. త్రిపురలో ఇటీవల చెలరేగిన హింసను ఖండిస్తూ కొన్ని ముస్లిం సంఘాలు శుక్రవారం ర్యాలీలు నిర్వహించగా, వాటికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దుకాణాలపై రాళ్లు రువ్వడం హింసకు దారి తీసింది. అమరావతితో (Amaravati news) పాటు నాందేడ్‌, మాలేగావ్‌, వషీం, యావత్మాల్‌ జిల్లాల్లోనూ అల్లర్లు చెలరేగాయి. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీలు ఝళిపించి, 20 మందిని అరెస్టు చేశారు. వివిధ అభియోగాలతో 20 కేసులు నమోదు చేశారు. మాలేగావ్‌లో ముగ్గురు అధికారులు సహా 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు పోలీసు వాహనంపై దాడికి దిగారు. దీంతో అమరావతి నగరంలో నాలుగు రోజులు కర్ఫ్యూ విధించారు అధికారులు. తిరిగి ప్రకటించే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంటర్నేట్ సేవల్ని కూడా నిలిపివేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం నాటి ర్యాలీల అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినవారు తిరిగి వెళ్తుండగా మూడు చోట్ల రాళ్లదాడి జరిగింది. దానికి నిరసనగా (Amaravati protest) శనివారం చేపట్టిన బంద్‌లో పలువురు కాషాయ జెండాలు చేతపట్టుకుని పాల్గొన్నారు. వరసగా రెండ్రోజులు రాళ్లు రువ్వుకున్న ఘటనలు జరగడం వల్ల కర్ఫ్యూ విధించాలని పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వైద్యపరమైన అవసరాల కోసం తప్పిస్తే ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విధించారు.


ఇదో కుట్ర మాత్రమే..


మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్ని పలు ప్రాంతాల్లో హింసను ఎగదోస్తున్నారని.. పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఘటనలకు కారకులైనవారి బండారాన్ని బట్టబయలు చేస్తామని చెప్పారు. 


‘అలాంటి సంఘటనలు జరగలేదు’


త్రిపురలో ఒక ప్రార్థన స్థలానికి వేరే వర్గం వారు నష్టం కలిగించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్రం తోసిపుచ్చింది. “త్రిపురలో అలాంటి ఏ ఘటనలోనూ ఎవరికీ గాయాలు కాలేదు. ఎవరిపైనా అత్యాచారం జరగలేదు. ఎవరూ చనిపోలేదు. అవాస్తవిక సమాచారంతో తప్పుదోవ పట్టించవద్దు. ప్రజలు సంయమనం పాటించాలి” అని హోంశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. 


Also Read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు!


Also Read: Delhi Lockdown News: ఢిల్లీలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్.. లాక్ డౌన్ తప్పదా? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook