బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న `AMPHAN` తుఫాను
దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న `AMPHAN` తుఫాను తీవ్ర రూప దాల్చనుందని, ఉత్తర దిశగా ప్రయాణించి తీవ్రమై మే 17 ఆదివారం మధ్యాహ్నం 14.30 గంటలకు
హైదరాబాద్: దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న "AMPHAN" తుఫాను తీవ్ర రూప దాల్చనుందని, ఉత్తర దిశగా ప్రయాణించి తీవ్రమై మే 17 ఆదివారం మధ్యాహ్నం 14.30 గంటలకు భయానక తుఫానుగా మారి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో లాటిట్యూడ్.11.7 డిగ్రీల ఉత్తరం, లాంగిట్యూడ్ 86.0 డిగ్రీల, తూర్పు వద్ద పారదీప్(ఒరిస్సా) కు దక్షిణ దిశగా 960 కీ మీ, (పశ్చిమ బెంగాల్) కు దక్షిణ నైఋతి దిశగా 1110 కీ మీ, ఖేపుపర(బంగ్లాదేశ్) కు దక్షిణ నైఋతి దిశగా 1230 కీమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.
Also Read: టీవీ నటుడు మన్మీత్ గైవాల్ ఆత్మహత్య..
ఇదిలాఉండగా రానున్న 24 గంటల్లో అతి భయంకరమైన తుఫానుగా మారే అవకాశం ఉందని, 12 గంటలలో ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్-బంగాదేశ్ తీరాల వద్ద డిగా(పశ్చిమ బెంగాల్) హతియా దీవులు(బాంగ్లాదేశ్) మధ్య మే 20న సాయాంత్రానికి తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..