Cyclone Jawad likely to hit Andhra Pradesh, Odisha on Saturday: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్​ తుపాను మరింత బలపడి పెను తుపానుగా మారినట్లు (Cyclone Jawad Updates) భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను ఇవాళ (డిసెంబర్ 4 శనివారం) ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలను తాకే అవకాశముందని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మధ్యాహ్నం తుపానుగా మారింది. ఏపీ, ఒడిశాల వైపు దూసుకొస్తోంది. ఇది ఆదివారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు (Cyclone Jawad to Hit AP Odisha on Saturday) తెలిపారు. అక్కడి నుంచి బెంగాల్ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు.


తుపాను ప్రభావంతో.. ఈ నెల 6 వరకు ఏపీ, ఒడిశా, పశ్చిమ్​ బెంగాల్​ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు  (Heavy rain fall due to cyclone Jawad)పడే అవకాశముంది.


ఏపీలో ఈ జిల్లాలపై అధిక ప్రభావం..


శ్రీకాకులం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో జవాద్​ తుపాను ప్రభావం అధికంగా ఉండనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (Cyclone Jawad effect on AP) వెల్లడించింది. తుపాను కారణంగా భారీ ఈదురు గాలులతో కూడిన  అతి భారీ వానలు పడుతాయని తెలిపింది. జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.


ఒడిశాలో 20 సెంటీమీటర్ల వర్షంపాతం!


ఒడిశాలో పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని వాతారవణ శాఖ అంచనా వేస్తోంది. గంజామ్​, గజపతి, పూరీ నయాగర్​, కటక, కేంద్రపరా సహా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చని (Cyclone Jawad effect on Odisha) తెలిపింది.


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 90-100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


తుపాను నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లని  పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఒడిశాలో 130 ఏళ్ల తర్వాద ఇదే తొలిసారి..


డిసెంబర్​ నెలలో ఒడిశా తీరాన్ని తుపాను తాకడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి అని ఐఎండీ (IMD on Cyclone Jawad) పేర్కొంది.


1891 తర్వాత డిసెంబర్​లో 14 తుపాన్లు ఏర్పడగా.. అందులో అందులో ఒడిశా తీరాన్ని ఒక్కటి కూడా దాటలేదని ఐఎండీ పేర్కొంది. జవాద్​ తుపానే.. 130 ఏళ్ల తర్వాత ఒడిశా తీరం దాటనున్న తొలి తుపానుగా వివరిచింది.


ఎన్​డీఆర్​ఎఫ్​ అప్రమత్తం..


జవాద్ తుపాను నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్ (NDRF over Cyclone Jawad)​ అప్రమత్తమైంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్​డీఆర్ఎఫ్​ బృందాలు మోహరించాయి. భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయి.


Also read: PM Narendra Modi: నేడు డెహ్రాడూన్​కు ప్రధాని మోదీ- రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!


Also read: Solar Eclipse 2021: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం నేడే- భారత్​లో కనిపిస్తుందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook