PM Narendra Modi: నేడు డెహ్రాడూన్​కు ప్రధాని మోదీ- రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!

PM Narendra Modi: డెహ్రాడూన్​లో నేడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే నెలకొల్పిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు కూడా.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 07:30 AM IST
  • నేడు ప్రధాని డెహ్రాడూన్​ పర్యటన
  • పలు అభివృద్ధి పనులు ఆవిష్కరించనున్న మోదీ
  • ఢిల్లీ-డెహ్రాడూన్​ ఎకానమిక్ కారిడార్​కు శంకుస్థాపన!
PM Narendra Modi: నేడు డెహ్రాడూన్​కు ప్రధాని మోదీ- రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన!

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (డిసెంబర్ 4 శనివారం) ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్​కు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, కొత్త వాటికి శంకుస్థాపన చేయడం (PM Modi Dehradun visit) వంటివి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.18,000 కోట్లుగా అంచనా.

ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ శాన్య రాష్ట్రాల్లో టూరిజం అభివృద్ధి పనులను, రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటివి ప్రధాని డెహ్రాడూన్ పర్యటనలో కీలకమైన అంశాలుగా తెలిసింది.

ఢిల్లీ-డెహ్రాడూన్​ ఎకానమిక్ కారిడార్​కు శంకుస్థాపన..

ప్రధాని మోదీ డెహ్రాడూన్​ పర్యటనలో నేడు మొత్తం 11 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఢిల్లీ-డెహ్రాడూన్​ ఎకానమిక్ కారిడార్ (ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే జంక్షన్ నుంచి డెహ్రాడూన్ వరకు) కీలకమైనది. ఈ ప్రాజెక్ట్ (Delhi-Dehradun Economic Corridor)​ అంచనా విలువ రూ.8,300 కోట్లు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్​కు ప్రస్తుతం ఉన్న ఆరు గంటల ప్రయాణ సమయం దాదాపు 2.5 గంటలకు తగ్గిపోనుంది.

ఈ ఎక్స్​ప్రెస్​వేలో ఏడు ముఖ్యమైన ఇంటర్​ఛేంజ్​లు ఉండనున్నాయి. వీటి ద్వారా.. హరిద్వార్​, ముజాఫర్​నగర్​, షామ్లీ, యమునా నగర్​, భాగ్​పట్​, మీరట్​, బరౌత్​ వంటి పట్టణాలకు అనుసంధానం అయ్యే అవకాశముంది.

ఈ ఎక్స్​ప్రెస్ వేలో 12 కిలో మీటర్ల మేర ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణుల ఎలివేటెడ్​ కారిడార్ (Asia’s largest wildlife elevated corridor)ఉండనుంది.

దీనితో పాటు.. డెహ్రాడూన్​లో నీటి సరఫర, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.700 కోట్లు.

కీలక ప్రాజెక్ట్​ ఆవిష్కరణ..

డెహ్రాడూన్​లో ఏర్పాటైన స్టేట్ ఆఫ్​ ఆర్టటట్ పెర్​ఫ్యూమరీ అండ్ అరోమా లాబోరేటరి (సెంటర్​ ఫర్​ అరోమాటిక్​ ప్లాంట్స్​)ను ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. ఇందులో జరిగే పరిశోధనలు.. పెర్​ఫ్యూమ్​లు, సబ్బులు, శానిటైజర్లు, ఎయిర్​ ఫ్రెషర్లు, అగరబత్తుల వంటి వాటిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కేంద్రం వల్ల.. సమీప ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు అవకాశముందని వివరించింది.

Also read: Kangana Ranaut News: పంజాబ్ లోని రైతులు నా కారుపై దాడి చేశారు: కంగనా రనౌత్

Also read: Man Slaps UP Police: ఎస్సై చెంప చెళ్లుమనిపించిన యువకుడు..వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News