ముంబై: Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landfall ). నిసర్గ తుపాన్ తీరం దాటేటప్పుడు 100-120 కిమీ వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రతో పాటు దక్షిణ గుజరాత్, గోవా, డయ్యూడామన్ తీరాలపైనా నిసర్గ తుపాన్ తీవ్ర ప్రభావం చూపనుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తుఫాన్ కదలికలపై, తుఫాన్ నష్టం తీవ్రత తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై చర్చించారు ( Maharashtra govt on high alert ).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు 


నిసర్గ తుఫాన్ మూడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూడామన్‌పై సైతం ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ( Amit Shah review meeting ) కూడా తుఫాను పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. మూడు రాష్ట్రాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాలు తీవ్ర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల నిమిత్తం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు (NDRF forces ) చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే కరోనావైరస్ విజృంభిస్తుండటంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మహారాష్ట్రను నిసర్గ తుఫాన్ రూపంలో మరో ప్రమాదం వెంటాడుతోంది.( తెలంగాణ సర్కారుకి గోదావరి, క్రిష్ణా రివర్ బోర్డులు షాక్ )


మహారాష్ట్రలోని పాల్గర్, పూణె, థానె, ముంబై, రాయఘడ్, ధూలె, నందుర్బర్, నాశిక్ ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ( Heavy rains ) వాతావరణ శాఖ పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..