Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు

రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.

Last Updated : Jun 1, 2020, 06:34 PM IST
Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు

న్యూ ఢిల్లీ: రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది. కొయికోడ్‌లో 9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా అదే జిల్లాలోని వడకరలో ( Vadakara in Kerala ) అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసుకుంది. త్రివేండ్రంలో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో విస్తారంగా వర్షాలు ( Heavy rains in Kerala ) కురుస్తుండటంపై భారత వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ శర్మ స్పందిస్తూ.. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే జూన్ 1న రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని తెలిపారు. తెలంగాణ సర్కారుకి గోదావరి, క్రిష్ణా రివర్ బోర్డులు షాక్ )

భారత్‌లో రుతుపవనాల ఆగమనం ముందుగా కేరళ నుంచే మొదలవుతుందనే సంగతి తెలిసిందే. జూన్ 1 నుండి రుతుపవనాల కదలికలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మోహపాత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15న తొలి దశలో అంచనా వేసినదాని ( Weather forecast ) ప్రకారం జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 100 శాతం వర్షపాతం నమోదవుతుందని.. రేపు రుతుపవనాల రెండో దశ నివేదికను విడుదల చేస్తామని డా మొహాపాత్రా పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News