Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ఇవాళ తుపానుగా మారి ఆ తరువాత తీవ్ర తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు అర్ధరాత్రి దాటిన తరువాత పశ్చిమ బెంగాల్-ఒడిశాల మధ్య తీరం దాటనుందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో తుపాను పరిస్థితుల ప్రభావం ఏపీపై లేకపోయినా మోస్తరు వర్షాలు మాత్రం పడనున్నాయి. రానున్న మూడ్రోజులు ఏపీలో వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, కడప, సత్యసాయి, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కోనసీమ జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. 


వాస్తవానికి బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ఏపీ, ఒడిశా రాష్ట్రాలవైపుకు ఉండాల్సింది కానీ వాయుగుండం దిశ మార్చుకోవడంతో పశ్చిమ బెంగాల్ వైపుకు మరలింది. రేపు రాత్రి తీరం తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. తుపాను ప్రభావం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉండవచ్చు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. 


Also read: 6th Phase Lok Sabha Polls 2024: దేశవ్యాప్తంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం పూర్తి.. 58 స్థానాలకు రేపే పోలింగ్..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook