cyclone yaas live updates: న్యూ ఢిల్లీ: యాస్ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి తీరాన్ని తాకనుంది. ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న యాస్ తుపాను.. ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఉన్న ధమ్ర పోర్టుకు (Dhamra Port) ఉత్తరాన, బాలాసోర్‌కి (Balasore) దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటనుంది. మంగళవారం సాయంత్రం నుంచే తీవ్రరూపం దాల్చిన యాస్ తుపాను.. తీరాన్ని దాటే సమయంలో మరింత బలపడనుందని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. తుపాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 130-140 కిమీ వేగంతో భారీ ఈదురు గాలులు వీయనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"209317","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"cyclone-yaas-live-updates-rain-lashes-odisha-west-bengal","field_file_image_title_text[und][0][value]":"యాస్ తుపాను లైవ్ అప్‌డేట్స్.. మధ్యాహ్నానికి తీరాన్ని దాటనున్న యాస్ తుపాను"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"cyclone-yaas-live-updates-rain-lashes-odisha-west-bengal","field_file_image_title_text[und][0][value]":"యాస్ తుపాను లైవ్ అప్‌డేట్స్.. మధ్యాహ్నానికి తీరాన్ని దాటనున్న యాస్ తుపాను"}},"link_text":false,"attributes":{"alt":"cyclone-yaas-live-updates-rain-lashes-odisha-west-bengal","title":"యాస్ తుపాను లైవ్ అప్‌డేట్స్.. మధ్యాహ్నానికి తీరాన్ని దాటనున్న యాస్ తుపాను","class":"media-element file-default","data-delta":"1"}}]]


యాస్ తుపాను ప్రభావంతో బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తుపాను ప్రభావం అధికంగా ఉన్న ఒడిషా, పశ్చిమ బెంగాల్‌తో పాటు జార్ఖండ్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.


Also read : Yaas Cyclone live updates: యాస్ తుపానుపై ఏపీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ సీఎంలతో అమిత్ షా సమీక్ష


ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై యాస్ తుపాన్ (Yaas cyclone ) ప్రభావం అధికంగా ఉండటంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే లక్షల మంది తీర ప్రాంత వాసులను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిషాలో 2 లక్షల మందిని తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం (Odisha govt) ప్రకటించగా, పశ్చిమ బెంగాల్లో 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) తెలిపారు.


Also read: ఏపీలో 252 Black fungus cases నమోదు.. అందుబాటులోకి Injections


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook