అమరావతి: ఏపీలో మంగళవారం నాటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 252 బ్లాక్ ఫంగస్ కేసులు (Black fungus cases in ap) నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం అవసరమైన ఇంజక్షన్లు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామని అనిల్ సింఘాల్ వెల్లడించారు. అందులో భాగంగానే బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ కోసం 3 వేల డోసుల ఇంజక్షన్లను (black fungus treatment) జిల్లాలకు పంపించామని అన్నారు.
బ్లాక్ ఫంగస్ మరణాలపై లేని సమాచారం..
బ్లాక్ ఫంగస్ మరణాలపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ స్పందిస్తూ.. ''ఏపీలో బ్లాక్ ఫంగస్ కారణంగా రోగులు మృతి చెందినట్టుగా ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాం'' అని చెప్పారు.
Also read : AP Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా, రికవరీ రేటులో పెరుగుదల
Remdesivir injections; రెమ్డిసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదు..
రాష్ట్రంలో రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ కొరత లేదని స్పష్టంచేసిన అనిల్ సింఘాల్... క్రిష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పంపిణీ చేసిన ఆయుర్వేద ఔషధంపైన (Krishnapatnam corona ayurvedic medicine) కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని తేల్చిచెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook