Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలోని పాల్ ఘడ్ జిల్లాలో సూర్య నది వంతెనపై డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మిస్త్రీ అక్కడికక్కడే మృతి చెందారు. 2012-2016 వరకు ఆయన టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేశారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1968 జులై 4న సైరస్ మిస్త్రీ జన్మించారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌సీ చేశారు. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేశారు.


2012లో రతన్ టాటా పదవి విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్‌నకు సైరస్ మిస్త్రీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. అప్పటివరకు షాపూర్జీ పల్లోంజి గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు 18 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఛైర్మన్‌గా నాలుగేళ్లు పనిచేసిన తర్వాత మిస్త్రీని టాటా గ్రూప్‌ తొలగించింది. వివిధ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వచ్చాయి.


టాటా సన్స్‌లో ఆయనకు 18.4 శాతం వాటా ఉంది. తన తొలగింపు విషయంలో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలగింపును సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లారు. తన కంపెనీలైన సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా రతన్ టాటాతోపాటు టాటా సన్స్‌లోని మరో 20 మందిపై కేసులు నమోదు చేయించారు. ఐతే వాటిని ఎన్‌సీఎల్‌టీ కొట్టిపారేసింది. విచారణకు సైతం అర్హత లేదని పేర్కొంది.


మళ్లీ దీనిపై న్యాయ పోరాటం చేశారు మిస్త్రీ. మూడేళ్ల న్యాయ పోరాటంతో ఆయనకు విజయం వరించింది. చివరకు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి నియమితులయ్యారు. కానీ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను గతేడాది సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.


Also read:Guava Benefits: జామ పండు తినడం వల్ల డయాబెటిస్‌ వారికి కలిగే ప్రయోజనాలు ఇవే..!


Also read:Rain Alert: ఉత్తర, దక్షిణ ద్రోణి ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి