Daily Covid updates: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
Corona Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులగా తగ్గుతూ వస్తున్న కొవిడ్ కేసులు తాజాగా పెరిగాయి.
India Covid-19 Updates: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా ఇన్ఫెక్షన్లు తాజాగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 9,629 కొత్త కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మరణాలు కేరళ నుంచే ఉన్నాయి. వైరస్ తో ఢిల్లీలో ఆరుగురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,31,398కి పెరిగింది. మరణాల రేటు 1.18%గా ఉంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 61,013గా ఉంది. మొత్తం కోవిడ్-19 కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.14గా ఉంది.
ఒక్క రోజులో 11,967 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 4,43,23,045గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.38 శాతం, విక్లీ పాజిటివిటీ రేటు 5.61 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 1,79,031 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటి వరకు చేసిన టెస్టుల సంఖ్య 92.58 కోట్లకు పెరిగింది. నిన్న 5,407 కరోనా టీకా డోసులు అందించారు. దీంతో ఇప్పటి వరకు అందించిన కరోనా వ్యాక్సిన్లు సంఖ్య 220.66 కోట్లకు చేరింది. ఏప్రిల్ 25న 6,660 కొత్త కోవిడ్ -19 కేసులు, అంతకుముందు రోజు 7,178 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
Also Read: Kerala: మరో ప్రాణం బలిగొన్న స్మార్ట్ ఫోన్.. 8 ఏళ్ల చిన్నారి వీడియో గేమ్ ఆడుతుండగా విషాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook