Kerala: మరో ప్రాణం బలిగొన్న స్మార్ట్‌ ఫోన్‌.. 8 ఏళ్ల చిన్నారి వీడియో గేమ్ ఆడుతుండగా విషాదం

ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడొద్దు.. వాడొద్దు అని చాలా మంది చెబుతూ ఉన్న కొంతమంది వాటిని ఏ మాత్రం పట్టిం. చుకోకుండా ప్రాణాల మీదకి  తెచ్చుకుంటున్నారు. సెల్ ఫోన్ పేలి 8 సంవత్సరాల పాప మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 01:42 PM IST
Kerala: మరో ప్రాణం బలిగొన్న స్మార్ట్‌ ఫోన్‌.. 8 ఏళ్ల చిన్నారి వీడియో గేమ్ ఆడుతుండగా విషాదం

Kerala: ఒకప్పుడు ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ ఉండటం వల్ల యాక్సిడెంట్స్ అయ్యేవి. ఫోన్స్ వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలంటూ రోడ్లపై పోస్టర్స్ వేసి మరీ ప్రచారం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో అలాంటి యాక్సిడెంట్స్ తో పాటు మొబైల్ ఫోన్స్ పేలడం వల్ల కూడా ప్రాణాలు పోతున్నాయి. కొన్ని కంపెనీల స్మార్ట్‌ ఫోన్ లు ఈ మధ్య కాలంలో పదే పదే పేలడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. చార్జింగ్‌ పెట్టి ఫోన్ మాట్లాడటం లేదా... గేమ్ ఆడటం వంటివి చేయడం వల్ల ఫోన్ లు బ్లాస్ట్‌ అవుతున్నాయి. ఎక్కువ సమయం చార్జింగ్‌ పెట్టి ఉంచినా కూడా వేడి ఎక్కువ అయ్యి బ్లాస్ట్‌ అవుతున్న దాఖలాలు ఉన్నాయి. 

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి త్రిస్సూర్‌ లోని తిరువిల్వామలకు చెందిన 8 ఏళ్ల ఆదిత్య శ్రీ చార్జింగ్ పెట్టి గేమ్‌ ఆడుతూ ఉండగా ఫోన్ బ్లాస్ట్‌ అయ్యి పాప చనిపోయింది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గంటల తరబడి గేమ్స్ ఆడటంతో పాటు ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్ ఆడటం వల్లే ఫోన్ బాగా వేడి అయ్యి బ్లాస్ట్‌ అయినట్లుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి 10.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతూ ఉండగా గతంలో పలు ఫోన్స్ బ్లాస్ట్‌ అయ్యాయి కానీ ప్రాణాలు పోయేంత ప్రమాదం మాత్రం జరగలేదు. కానీ ఆదిత్య శ్రీ 8 ఏళ్ల పాప అవ్వడం తో మృతి చెందినట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి రోజు గంటల తరబడి గేమ్ ఆడుతూ ఉండే ఆదిత్య శ్రీ ఆరోజు కూడా  గేమ్‌ ఆడుతూ ఫోన్ చార్జింగ్‌ లేకపోవడంతో తల్లిదండ్రులు పడుకుని ఉండగా చార్జింగ్‌ పెట్టింది. చార్జింగ్‌ పెట్టిన తర్వాత కూడా ఆదిత్య శ్రీ గేమ్‌ ఆడుతూనే ఉండటంతో ఒక్కసారిగా బ్లాస్ట్‌ అయినట్లుగా భావిస్తున్నారు. పెద్ద శబ్దం వచ్చి ఫోన్ పేలిన తర్వాత చిన్నారి మృతి చెంది కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లినా కూడా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. ఆదిత్య శ్రీ స్థానిక క్రైస్ట్‌ న్యూ లైఫ్‌ స్కూల్‌ లో 3వ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 

Also Read: Tamannaah Bhatia Dinner Date : కారులో లవర్‌తో తమన్నా.. డిన్నర్ పార్టీ కోసం బయటకు వచ్చిన బ్యూటీ

ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండటం లేదని ఇలాంటి సంఘటనలతో మరోసారి నిరూపితం అయ్యింది. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ప్రచారం చేసి పిల్లల్లో మరియు పెద్దల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తను పాటించాల్సిన అవసరం ఉంది. చార్జింగ్‌ పెట్టిన సమయంలో ఫోన్ ను కనీసం ఆపరేట్‌ చేయడం కూడా మంచిది కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక మాట్లాడటం.. గేమ్స్ ఆడటం అత్యంత ప్రమాదకరం అని వారు హెచ్చరిస్తున్నారు.

Also Read: YS Sharmila News Updates: వైఎస్ షర్మిలకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News