థానే: కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్ మరియు అండర్ వరల్డ్ డాన్ అయిన ఇక్బాల్ కస్కర్‌ను థానే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.  తాము అక్రమ లావాదేవీలు జరిపినప్పుడు సాధారణంగా ఎలాంటి కోడ్ వర్డ్స్ ఉపయోగిస్తారో ఆయన పేర్కొన్నారు. డీ కంపెనీ చేసే లావాదేవీల్లో "ఛోటాషకీల్" అనే పదానికి బదులు "మోడీ" అనే పదాన్ని, "కరాచీ" అనే పదానికి బదులు "ఢిల్లీ" అనే పదాన్ని వాడతామని పేర్కొన్నారు. 


అలాగే దావూద్ మాటకు బదులు బడే అనే మాటను, "పోలీస్ వ్యాన్" అనే మాటకు బదులు "డబ్బా" అనే మాటను వాడుతున్నట్లు చెప్పారు.1 లక్ష అనే పదానికి బదులు "ఏక్ పేటీ" అనే పదాన్ని, "1 కోటి" అనే పదానికి బదులు "ఏక్ బాక్స్" అనే పదాన్ని వాడుతున్నట్లు తెలిపారు. ఈ కోడ్ వర్డ్స్ గురించి పంచుకోవడంతో పాటు ప్రస్తుతం దావూద్ తన తమ్ముడు  అనీస్ ఇబ్రహీంతో కలిసి పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు కస్కర్ తెలిపారు.