COVID19 వ్యాక్సిన్‌లో మరో ముందడుగు
భారత్‌లో మనుషులపై కోవిడ్19 వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి సీరమ్- ఆక్స్‌ఫర్డ్ (Oxford COVID19 Vaccine)కు డీసీజీఐ అనుమతి లభించింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)కు మనుషులపై రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్, ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా కోవిడ్19 వ్యాక్సిన్‌ను రుపొందిస్తున్న విషయం తెలిసిందే. Amul పసుపు ఐస్‌క్రీమ్.. మీ ఆరోగ్యంపై బెంగవద్దు
విషయ నిపుణుల కమిటీ (Subject Expert Committee) గత వారం ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ తయారీ, ప్రస్తుత దశలపై ఆన్‌లైన్ మీటింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ (COVISHIELD) (SII-ChAdOx1 nCoV-19) రెండో దశ, మూడో దశ ప్రయోగాలకు అనుమతి లభించింది. దీని ప్రకారం తొలి రోజు ఒక డోస్ ఇస్తే.. రెండో డోస్ 29వ రోజున ఇవ్వనున్నారు. అయితే మూడో దశ ట్రయల్స్ ప్రారంభించే ముందు డేటా సెఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (DSMB) పరిశీలించిన రిపోర్టులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు సమర్పించాల్సి ఉంటుంది. అందాల ‘దేశముదురు’ హన్సిక Photos
రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్‌స్టిస్టూట్ గత వారం అనుమతి కోరింది. తాజాగా అనుమతి లభించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్ (COVISHIELD). యూకేలో ఈ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...