న్యూ ఢిల్లీ: నిర్భయ నుంచి దిశ వరకు.. అత్యాచారాల పర్వంపై దేశవ్యాప్తంగా మహిళా లోకం భగ్గుమంది. గతంలో నిర్భయ అత్యాచార ఘటన తర్వాత.. నిర్భయ చట్టాన్ని రూపొందించినప్పటికీ.. దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. దిశ అత్యాచార ఘటనతో ఇప్పుడు మరోసారి అగ్గి రాజుకుంది.  దేశవ్యాప్తంగా న్యాయం కోసం మహిళలు మరోసారి ఉద్యమం చేపట్టారు. అదే పంథాలో ఢిల్లీ మహిళ కమిషన్ కూడా నడుం బిగించింది. నేటి నుంచి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కచ్చితంగా 6 నెలల్లో ఉరి తీయాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఒకే ఒక్క డిమాండ్‌తో ఈ రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారు. కేంద్రం హామీ ఇచ్చే వరకు నిరసన దీక్ష వీడేది లేదని ఆమె స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"180498","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు స్వాతి మలివాల్ దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో  పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తుంటే.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తానేమీ క్రిమినల్ కాదని స్వాతి మలివాల్ అసహనం వ్యక్తం చేశారు.


[[{"fid":"180499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]