దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం -2019పై వ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. CAA-2019, NRCని వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రోజూ ఇవే ఆందోళనలతో అట్టుడుకుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  చల్లగా ఓ వార్త చెప్పింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పింది.  ప్రస్తుతానికి ఇంకా పౌరసత్వ జాబితా.. NRC అమలుపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో రాత పూర్వక సమాధానం ఇచ్చారు. 


మరవైపు ఫిబ్రవరి 3న (నిన్న) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ . . పౌరసత్వ సవరణ చట్టం.. CAA,జాతీయ పౌరుల జాబితా .. NRC, జాతీయ జన గణన.. NPRపై సభలో చర్చ చేపట్టాలని కోరుతూ తీర్మానాలు ఇస్తున్నాయి. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై సభ దద్దరిల్లుతోంది.