భారతదేశ జాతీయ జంతువుగా ఆవుని ప్రకటించాలన్న వాఖ్యలపై దుమారం రేగుతోంది. జమైతే ఉలేమా-ఇ-హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ మద్ని మంగళవారం మాట్లాడుతూ, ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే.. ఆవులు, మానవులు సురక్షితంగా ఉంటారని చెప్పారు. "ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి ఒక చట్టం చేయండి. ఆవిధంగానైనా ఆవులు, మానవ జీవితాలు రెండూ సురక్షితంగా ఉంటాయి. ఈ దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది" అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత సంవత్సరం కూడా మౌలానా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. పెరుగుతున్న హింసాకాండ, గోహత్యలతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు.  


గోవాలోని ఆల్-ఇండియా హిందూ కన్వెన్షన్ గత ఏడాది ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే ప్రతిపాదన ఎన్నడూ లేదని ప్రభుత్వం తెలిపింది.