గత నెలలో లడఖ్‌లోని గాల్వన్ లోయలో ఘర్షణల తర్వాత భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు తమ సైనికులను బఫర్ జోన్ నుంచి వెనక్కి రప్పించాయి. మరోవైపు రెండు దేశాల మధ్య శాంతి కోసం ఉన్నతస్థాయి అధికారులు చర్చలు దశలవారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి సరిహద్దుల్లో పరిస్థిని సమీక్షించేందుకు శుక్రవారం ఉదయం లడఖ్ వెళ్లారు. అక్కడ ఆయనకు సైనికులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. Rajasthan: ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు రోజులపాటు సరిహద్దుల్లో రాజ్‌నాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు. తొలుత లేహ్‌లోని స్టాక్నా సైనిక స్థావరంలో సైనికుల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. అందులో కొన్ని ఆయుధాల వివరాలను అడిగితెలుసుకున్నారు. యుద్ధ ట్యాంకుల పనితీరును రక్షణమంత్రికి సైనికులు వివరించారు. పికా మెషీన్ గన్‌ను చేతుల్లోకి తీసుకుని ఎలా ఉపయోగిస్తారో రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. India: 10 లక్షల కరోనా కేసులు, 25వేల మరణాలు



కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంట సీడీఎస్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా, శనివారం మధ్యాహ్నం శ్రీనగర్‌కు వెళ్లి సరిహద్దుల్లో పరిస్థితిని రాజ్‌నాథ్ సమీక్షించనున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇదే తీరుగా సరిహద్దుకు వెళ్లి సైనికులను పరామర్శించి, అక్కడి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం తెలిసిందే. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్       
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..