Mid Air Miracle: ఆగిన ప్రాణం, 45 నిమిషాల శ్రమతో ప్రాణం పోసిన వైద్యులు, విమానంలో అద్బుతం
Mid Air Miracle: విమానాల్లో అవమానాలు, అసభ్యకర ఘటనలే కాదు..అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ఆగిన ఊపిరికి జవజీవాలు అందించే అపురూపమైన ఘట్టం విమానంలోనే ఆవిష్కృతమైంది. ఐదుమంది ఆన్‌బోర్డ్ వైద్యులు చేసిన కృషి రెండేళ్ల చిన్నారికి ఆయువునిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mid Air Miracle: ఇంకా పూర్తిగా లోకాన్ని చూడని అభం శుభం తెలియని ఓ రెండేళ్ల చిన్నారి. అపస్మారక స్థితిలో ఆగిన ఆ చిన్నారికి విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఎయిమ్స్ వైద్యులు ఆయువు పోశారు. 45 నిమిషాలు శ్రమించి ప్రాణం నిలబెట్టారనే కంటే ప్రాణం పోశారని చెప్పాలి. అసలేం జరిగిందంటే...
ఢిల్లీకు చెందిన రెండేళ్ల చిన్నారికి గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తరువాత బెంగళూరు-ఢిల్లీ విస్తారా ఎయిర్ లైన్స్‌లో తిరిగి ఢిల్లీకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ చిన్నారి అస్వస్థకు గురై అపస్మారక స్థితిలో చేరుకుంది. విమానంలో ఎవరైనా వైద్యులున్నారేమోనని అత్యవసర ప్రకటన జారీ అయింది.
ఆ చిన్నారి అదృష్టమో..దేవుడే పంపించాడో తెలియదు కానీ..ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ఢిల్లీకు చెందిన ఐదుగురు వైద్యులున్నారు ఆ విమానంలో.
బెంగళూరులో జరిగిన ఇండియన్ సొసైటీ ఫర్ వాస్క్యులర్ అండ్ ఇంటర్‌వెన్షనల్ రేడియాలజీ సమావేశానికి హాజరై తిరిగి వస్తున్నారు ఆ వైద్యులు. ఈ ఐదుగురు వైద్యుల్లో ప్రముఖ సీనియర్ ఎనస్థీషియన్ డాక్టర్ నవ్‌దీప్ కౌర్, సీనియర్ కార్డియాక్ రేడియాలజీ డాక్టర్ దమన్‌దీప్ సింగ్, సీనియర్ ఎయిమ్స్ రేడియాలజీ డాక్టర్ రిషభ్ జైన్, సీనియర్ వైద్యులు డాక్టర్ ఓయిషికా, సీనియర్ కార్డియాక్ రేడియాలజీ డాక్టర్ అవిచలా తక్షక్ ఉన్నారు.
వెంటనే స్పందించిన ఆ ఐదుగురు ఆ శిశువును పరీక్షించారు. అప్పటికే ఆ శిశువుకు నాడి అందడం లేదు. అవయవాలు చల్లబడి ఉన్నాయి. సయోనైజ్డ్ లిప్స్ , ఫింగర్స్‌తో శ్వాస కూడా ఆడటం లేదు. అంతే తక్షణం విమానంలోనే పరిమితిమైన వనరుల సహాయంతో, ఆ ఐదుగురు తమ సామర్ధ్యాన్ని ఉపయోగించి తక్షణం సీపీఆర్ చేశారు. అందుబాటులో కొద్దిపాటి వనరుల్ని, ఆక్సిజన్ ఉపయోగించి విజయవంతంగా ఆ చిన్నారికి ఐవీ క్యానెల్ అమర్చి ఓరోఫారింజీల్ ఎయిర్ వే అమర్చగలిగారు. తిరిగి రక్త ప్రసరణ జరిగేలా చేశారు. దాదాపు 45 నిమిషాల శ్రమ అనంతరం ఆ చిన్నారిలో కదలిక వచ్చింది.
వైద్యుల సూచన మేరకు విమానాన్ని నాగపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ముందుగా సమాచారం అందించడంతో నాగపూర్ విమానాశ్రయ సిబ్బంది ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. నాగపూర్ ఆసుపత్రిలో ఆ చిన్నారికి సర్జరీ చేశామని. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు.
సకాలంలో స్పందించి ఆ చిన్నారికి ప్రాణం పోసిన ఐదుగురు ఎయిమ్స్ వైద్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్నివైపుల్నించి అబినందనలు వెల్లువెత్తుుతున్నాయి. ఈ ఘటనను ఢిల్లీ ఎయిమ్స్ ట్వీట్ చేసింది.
Also read: Aditya-L1 Launch Date: ఆదిత్య ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధం.. ప్రయోగం ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook