Delhi Airport: ఉగ్రవాద హెచ్చరిక..భారీ భద్రత
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్రవాద హెచ్చరిక..నేపధ్యంలో రెడ్ అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ రెండు విమానాల్ని అడ్డుకుంటామనేదే ఆ హెచ్చరిక.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ( Delhi International Airport ) ఉగ్రవాద హెచ్చరిక..నేపధ్యంలో రెడ్ అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ రెండు విమానాల్ని అడ్డుకుంటామనేదే ఆ హెచ్చరిక.
ఆ రెండు విమానాల్ని ( Two london flights ) ఉగ్రవాదులు ( Terrorists ) టార్గెట్ చేశారా..కేవలం హెచ్చరికేనా. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ ( Khalistan commando force ) అనే తీవ్రవాద సంస్థ ( Terrorist group ) కు చెందిన గురుపత్‌వంత్ సింగ్ పన్ను ఈ హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 5న తీవ్రవాదదాడికి పాల్పడే అవకాశముందని వార్నింగ్ కాల్ ( Threatening call ) చేశాడని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ నుంచి లండన్ కు వెళ్లే ఆ రెండు విమానాల్ని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు ఖలిస్తాన్ తీవ్రవాదులు.
ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోత జరిగి 36 ఏళ్లను నిండుతున్న సందర్బంగా ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే భద్రతను పటిష్టం చేశారు.
దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ( Indira gandhi assassination ) ని 1984లో అంగరక్షకులుగా ఉన్న సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా సిక్కుమతస్థుల్ని టార్గెట్ చేసుకుని ఆందోళనలు కొనసాగాయి. అప్పట్లో ఢిల్లీలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో( 1984 Sikh riots ) ఇద్దరు నిందితులకు రెండేళ్ల క్రితం ఢిల్లీ కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది.
ఈ ఘటన జరిగి 36 ఏళ్లైన సందర్బంగా వచ్చిన హెచ్చరిక కావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భద్రతను భారీగా పెంచారు. పరిసరాల్లో నిఘాను పటిష్టం చేశారు. Also read: ICAI Exams 2020: సీఏ పరిక్షలలో స్పందించిన సుప్రీం కోర్టు