Weekend Curfew in Delhi and Karnataka: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బకు విల్లవిల్లాడిపోయిన ప్రజలు... ఎక్కడ థర్డ్ వేవ్ ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూకి సిద్ధమయ్యాయి. తమిళనాడులో ఆదివారం నుంచి సండే లాక్‌డౌన్ అమలులోకి రానుంది. ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని విద్యాసంస్థలను మూసివేయగా.. మున్ముందు మరిన్ని కఠిన నిబంధనలు అమలుచేసే యోచనలో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ :


ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం (జనవరి 7) రాత్రి 10గంటల నుంచే అమలులోకి వచ్చింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు ప్రభుత్వం జారీ చేసిన ఈ-పాస్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈపాస్ కోసం www.delhi.gov.in. వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. 


విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు వెళ్లేవారు తమ ప్రయాణానికి సంబంధించిన టికెట్లను చూపించాల్సి ఉంటుంది. టికెట్లు లేనివారిని కర్ఫ్యూ సమయంలో బయటకు అనుమతించరు. నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులు, మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. హోటల్స్, రెస్టారెంట్స్ మూసి ఉంటాయి. ఫుడ్ డోర్ డెలివరీకి అనుమతి ఉంటుంది. అలాగే, ఈకామర్స్ గూడ్స్ డోర్ డెలివరీకి అనుమతి ఉంటుంది.


పబ్లిక్ పార్కులు మూసి ఉంటాయి. వివాహాది శుభాకార్యాలకు కేవలం 20 మందినే అనుమతిస్తారు. డీటీసీ బస్సులు, మెట్రో రైళ్లలో సీటింగ్ కెపాసిటీ మేరకే ప్రయాణికులను అనుమతిస్తారు. నిలబడి ప్రయాణం చేయడం ఉండదు.


కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ 


కర్ణాటకలోనూ వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం (జనవరి 7) రాత్రి 10గం. నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం (జనవరి 10) 5గం. వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను రెండు వారాల పాటు మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.


కర్ఫ్యూ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే వివాహ కార్యక్రమాలకు 200 కంటే తక్కువ, ఫంక్షన్ హాల్స్‌లో జరిగే వివాహాలకు 100 కంటే తక్కువ మందిని అనుమతిస్తారు. బార్స్, పబ్స్, సినిమా థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయి.


మహారాష్ట్ర, కేరళ (Kerala), గోవా రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి.


Also Read: Horoscope Today January 8 2022: ఆ రాశి వారికి వార్నింగ్.. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook