Horoscope Today January 8 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వార్నింగ్.. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త..

Horoscope Today  January 8 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ ఉద్యోగ, వ్యాపార పరమైన నిర్ణయాలకు పూర్తిగా అనుకూల సమయం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 07:40 AM IST
  • మకర రాశివారికి అత్తమామలతో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు
  • కుంభ రాశివారు కొత్త పనులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతారు
  • కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తుంది
Horoscope Today January 8 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి వార్నింగ్.. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త..

Horoscope Today January 8 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొంతమందికి ఆర్థికపరమైన వ్యవహారాలు కలిసిరాకపోవచ్చు. కొన్ని రాశుల వారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఆచీతూచీ వ్యవహరించడం మంచిది. దూకుడు స్వభావం ఉన్న వ్యక్తులతో కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలి.

మేషం : ఓ స్నేహితుడి కారణంగా కొన్ని విషయాల్లో మీ దృక్పథం విశాలమవుతుంది. సంకుచిత మనస్తత్వం వీడుతారు. మీరు రహస్యంగా ఉంచదలుచుకున్న పనుల్లో జాగ్రత్త అవసరం. లేదంటే ఇబ్బందులు తప్పవు. లక్కీ కలర్: లిలక్, లక్కీ నంబర్: 7

వృషభం : మీరు మంచి స్నేహితులని నమ్మినవారు మిమ్మల్ని కొంత నిరాశకు గురిచేయవచ్చు. వ్యాపార భాగస్వాములు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతారు. రెగ్యులర్ బిజీ వర్క్ నుంచి కాస్త రిలాక్సేషన్‌కు ప్రాధాన్యమిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. లక్కీ కలర్ : బ్రిక్ రెడ్, లక్కీ నంబర్ : 2 

మిథునం : సృజనాత్మక వ్యక్తులకు అద్భుతమైన రోజు. మీ పని అప్రయత్నంగా సాగుతుంది. చిన్నపాటి అనారోగ్యాల పట్ల జాగ్రత్త వహించండి. పిల్లలు లేదా ప్రియమైనవారు మీపై కాస్త ఎక్కువ బాధ్యతలను మోపవచ్చు. లక్కీ కలర్ : హానీ, లక్కీ నంబర్ : 3

కర్కాటకం : ఫైనాన్స్, పెట్టుబడులకు ఇవాళ ప్రతికూల సమయం. ఆర్థికపరమైన లావాదేవీలు అంతలా కలిసిరాకపోవచ్చు.  కొత్త పనుల్లో కొంత ఆటంకాలు తప్పవు. కీలక విషయాల్లో బంధుమిత్రులు, సన్నిహితుల సలహాలు తీసుకోండి. లక్కీ కలర్ : బ్లూ, లక్కీ నంబర్ : 8

సింహం : భావోద్వేగాలను తక్కువగా అంచనా వేయకండి. మనసు పెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగపరమైన, వృత్తిపరమైన నిర్ణయాలకు అనుకూల సమయం. పూర్తి చేయాల్సిన పనులు సకాలంలో పూర్తవుతాయి. లక్కీ కలర్ : యాష్, లక్కీ నంబర్ : 6

కన్య : దూకుడు మనస్తత్వం కలిగిన ఓ వ్యక్తి వల్ల ఇవాళ మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవొచ్చు. అతని పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయండి. ఇతరులతో ఏ విషయంలోనూ ఆర్గ్యుమెంట్స్ మంచివి కాదు. లక్కీ కలర్ : మ్యాంగో, లక్కీ నంబర్: 4

తుల : కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి ముందడుగు వేయండి. అప్పుల జోలికి వెళ్లకపోవడం మంచిది. దీర్ఘకాలిక సమస్యలపై నిర్ణయాలకు అనువైన రోజు. లక్కీ కలర్ : ఇండిగో, లక్కీ నంబర్ : 1

వృశ్చికం: చాలాకాలంగా పూర్తి చేయాలనుకున్న పని ఒకటి పూర్తయ్యే అవకాశం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో సాగదీత ధోరణి మంచిది కాదు. లక్కీ కలర్ :అంబర్, లక్కీ నంబర్: 5

ధనుస్సు : కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకపోయినా సంకల్పం వీడకండి. పట్టుదలతో ముందుకెళ్తే మీరు సాధించగలరు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. లక్కీ కలర్ : లిలక్, లక్కీ నంబర్ : 3

మకరం : అత్తమామలతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్ని ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. కొత్త పనులకు అనువైన సమయం. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్కీ కలర్ : స్కార్లెట్, లక్కీ నంబర్ : 5

కుంభం : కొత్త పనులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతారు. కుటుంబ సభ్యులతో పాటు అన్ని రకాల బంధాలు మరింత మెరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మనసు మళ్లుతుంది. మీ పై అధికారులతో వ్యవహారాలను జాగ్రత్తగా డీల్ చేయండి. లక్కీ కలర్: మజెంటా, లక్కీ నంబర్: 9 

మీనం : మీ జీవిత భాగస్వామి లేదా మీ ప్రియమైన వ్యక్తులు మిమ్మల్ని డామినేట్ చేస్తుంటారు. సహృదయతో కొన్ని విషయాలను భరిస్తారు. అనాలోచిత నిర్ణయాలను పూర్తిగా పక్కన పెడితే మంచిది. ఉద్యోగ, వ్యాపార పరంగా పూర్తిగా అనుకూల సమయం. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. లక్కీ కలర్ : రెడ్, లక్కీ నంబర్: 2

Also Read: Vanama raghava arrest : పాల్వంచ‌ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పురోగతి.. మూడు రోజులకు దొరికిన వ‌న‌మా రాఘ‌వ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News