న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల కమిషన్ (ఈసీ) షాకిచ్చింది. ఎన్నికల నియామావళి ఉల్లంఘించారని సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు కాంప్లెక్స్‌లో మోహళ్ల క్లినిక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారని ఈసీ తమ నోటీసులలో పేర్కొంది. శుక్రవారం (జనవరి 31) లోగా నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈసీ సూచించింది. కాగా బీజేపీ ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ కేజ్రీవాల్ ఇచ్చే వివరణ ఓకే కాదని భావిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువెంతో తెలుసా?


తనను తీవ్రవాది అని చేసిన వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. తాను ఢిల్లీ ప్రజలకు సోదరుడినో, కుమారుడినో లేక తీవ్రవాదిగా అవుతానో ఎన్నికలలో ఓటుతో వారే నిర్ణయిస్తారని చెప్పారు. షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ అవినీతికి వ్యతిరేకంగా తాను నిరాహార దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి ఉగ్రవాది ఎలా అవుతారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.


Also Read: 10 హామీలతో కార్డు విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్


మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేజీ ఎంపీ పర్వేష్ వర్మలను ఢిల్లీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి ఈసీ తొలగించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం నుంచి ఠాకూర్‌ను మూడు రోజులపాటు, పర్వేష్ వర్మను నాలుగు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..