మాకు ఇప్పటికీ ఆశ ఉంది.. 
కమలం పార్టీలో నైరాశ్యం లేదు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.  మరికాసేపట్లో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా మధాహ్నం వరకు ఈవీఎంలలో నిక్షిప్తమైన 672 మంది భవితవ్యం తేలిపోనుంది.  ఈ నేపథ్యంలో దేశంలో అందరి చూపు .. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని అటు ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇటు బీజేపీ రెండు ధీమాగా ఉన్నాయి.
 


మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో అన్ని పోల్ ట్రెండ్స్ . .  ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి.  దాదాపు 50 స్థానాల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆధిక్యంలో కనిపిస్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ దాదాపు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ సహా స్వతంత్రులు ఎవరూ ఆధిక్యంలో కనిపించడం లేదు. దేశంలో ప్రధాన జాతీయ  పార్టీగా ఉన్న కాంగ్రెస్.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి దరిదాపుల్లో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. 


[[{"fid":"181902","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు పోల్ ట్రెండ్స్ పై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ స్పందించారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని. .  బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతుందని తెలిపారు. పోలింగ్ ఫలితాల సరళి ఎలా ఉన్నా బీజేపీలో మాత్రం నైరాశ్యం లేదని.. ఇప్పటికీ తమకు ఆశ ఉందన్నారు.  ఐతే ఉదయం మీడియాతో మాట్లాడిన మనోజ్ తివారీ..  బీజేపీ 55 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.