Delhi Chalo farmers protest: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 10 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఐదో సారి జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేయగా.. మంత్రులు సవరణలకే మొగ్గు చూపించారు. ఇరుపక్షాలూ కూడా తమ తమ వైఖరికే కట్టుబడడంతో చర్చలు మళ్లీ అసంపూర్తిగా ముగిశాయి. రైతు సంఘాల అభ్యంతరాలపై చర్చించడానికి గడువు కావాలని.. దీనిపై మళ్లీ 9న సమావేశమవుదామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన చర్చల్లో 35 రైతు సంఘాల (Farmer union leaders) ప్రతినిధులతోపాటు, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ( Narendra Singh Tomar ) రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌, వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ విలేకరులతో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని తోమ‌ర్‌ తెలిపారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులను ఇండ్లకు పంపాలని ఆయన రైతు సంఘాలకు విన్నవించారు.  Also read: Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు


ఇదిలాఉంటే.. ఈ నెల 8వ తేదీన రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు పది ప్రధాన కార్మిక సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. ఓ సంయుక్త వేదికగా ఏర్పడ్డ ఈ సంఘాల్లో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్లుఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, యూటీయూ సంఘాలు రైతులకు మద్దతుగా భారత్ బంద్‌లో పాల్గొంటాయని స్పష్టంచేశాయి.  Also read: #WATCH: బురేవి తుఫానుతో.. చర్చి గోడలు ఎలా కూలిపోయాయో చూడండి


 


Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్


Also read: Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook