Free vaccination: కేంద్రం కాదంటే..మేమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
Free vaccination: కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించారు.
జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ నగరాలకు వ్యాక్సిన్ చేరుకుంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వారియర్ల ( Frontline warriors ) కు మాత్రమే వ్యాక్సిన్ అందిస్తుండటంతో పరిమిత సంఖ్యలో ఒక్కో రాష్ట్రానికి వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం ( Central Government ). కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఒకవేళ కేంద్రం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించని పక్షంలో ఢిల్లీ ప్రజలకు తాము ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామంటూ గుడ్‌న్యూస్ చెప్పారు.
కోవిడ్ 19 విధి నిర్వహణలో ఉండి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi Cm Arvind kejriwal ) పరామర్శించారు. వ్యాక్సిన్ గురించి తప్పుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశానన్నారు. కేంద్రం అంగీకరించకపోతే తామే ఢిల్లీ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ( Free vaccination ) ఇస్తామన్నారు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరి హక్కు అని..దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా గతంలో ఓసారి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
Also read: Google maps: ప్రాణం తీసిన గూగుల్ తల్లి..డ్యామ్‌లో పడిపోయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook