Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కరోనా పరీక్షలు పూర్తి
Arvind Kejriwal`s COVID-19 test : న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక వైద్య బృందం ఇవాళ ఉదయం ఆయన రక్త నమూనాలను సేకరించింది.
Arvind Kejriwal`s COVID-19 test : న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రత్యేక వైద్య బృందం ఇవాళ ఉదయం ఆయన రక్త నమూనాలను సేకరించింది. ఇవాళ రాత్రి లేదా రేపు బుధవారం ఉదయానికి కేజ్రీవాల్ కరోనావైరస్ టెస్ట్ రిపోర్ట్ ( COVID-19 test reports) రానుందని సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్‌కు జ్వరం తగ్గిందని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు తమ ముఖ్యమంత్రికి కరోనా పరీక్షల్లో ఎటువంటి ఫలితం రానుందోననే ఆందోళన ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ( కరోనా మృత్యుహేల.. దేశంలో పిట్టల్లా రాలిపోతున్న జనాలు )
ఇదిలావుంటే ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఢిల్లీలో సోమవారం నాడు 1007 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఢిల్లీలో కరోనావైరస్ సోకిన బాధితుల సంఖ్య 29,943 లకు చేరింది (COVID-19 cases in Delhi). ఇప్పటివరకు ఢిల్లీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 874కి చేరింది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తోంటే.. మరో రెండు వారాల్లోపు ఢిల్లీలో 56,000 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అర్థమవుతోందని ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు. జూన్ 3న ఒకే రోజున అత్యధికంగా 1,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..