Delhi Crime Issue: తల్లి అంటేనే ప్రేమకు..దయకు చిహ్నం. అదే సమయంలో లోకంలో కర్కశత్వానికి మారుపేరుగా నిలిచే తల్లులు కూడా ఉంటారా అంటే..అవుననే సమాధానం విన్పిస్తుంది. అదే జరిగింది దేశ రాజధాని నగరం ఢిల్లీలో..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సృష్టిలో అందమైన పదం..అందమైన సృష్టి కూడా అమ్మే. ఆ పదమే ఓ మధురం. ఓ జ్ఞాపకం. దయకు, ప్రేమకు, ఆప్యాయతకు పర్యాయపదం. అందుకే బిడ్డ ఏడిస్తే చాలు కన్నతల్లి తల్లడిల్లిపోతుంది. చిన్న దెబ్బ తగిలినా..ఆ అమ్మ హృదయం విలవిల్లాడుతుంది. మరి దేశ రాజధాని ఢిల్లీలో ఆ తల్లి చేసిన పనికి ఏమనాలి..ఆ తల్లిని ఏ పేరుతో పిలవాలి..మాతృత్వానికే మాయని మచ్చగా, కర్కశత్వంగా వహించిన ఆ తల్లిని ఏం చేయాలి. ఢిల్లీ ఘటన వింటే ఇవే ప్రశ్నలు ఉదయిస్తాయి.


ఢిల్లీలోని మాళవీయ నగర్, చిరాగ్ ఏరియాలో గుల్షన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతులకు 2 నెలల క్రితం పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆడపిల్లంటే ఇష్టం లేని డింపుల్..ఆ పసిబిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంటగదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టి కాల్చేసింది. పక్కగదిలోని నానమ్మ ఈ ఘటన చూసి గట్టిగా కేకలేసింది. దాంతో వంటగది లాక్ చేసేసింది. ఆ వృద్ధురాలి కేకలతో అక్కడికి చేరుకున్న చుట్టుపక్కలవాళ్లు..జరిగింది విని విస్తుపోయారు. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గది తలుపులు పగలగొట్టి ఓవెన్‌లో చూడగా..ఆ పసిబిడ్డ మరణించి ఉంది. 


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతుల్ని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన గురించి విన్న మాళవియ నగర్ స్థానికులు విస్తుపోతున్నారు. ఇంతటి కర్కశమైన తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. 


Also read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook