Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!

Lalu Yadav Health: గతంలో అనారోగ్య సమస్యల కారణంగా రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 02:14 PM IST
Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!

Lalu Yadav Health: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ఆధినేత లాలూ యాదవ్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఇప్పుడాయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనారోగ్యం కారణంగా గతంలో ఆస్పత్రిలో చేరిన లాలూ యాదవ్.. రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందారు. 

అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించనున్నారు. దీనిపై రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. అయితే ఆ సమావేశం తర్వాత లాలూ యాదవ్ ను ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 

పశువుల దాణా కుంభకోణం కేసులో జైలుకు..

పశువుల దాణ కుంభకోణం కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.. అనారోగ్యం కారణంగా రాంఛీలోని రిమ్స్ లో చేరారు. గత కొన్ని రోజులుగా అక్కడే చికిత్స పొందుతుండగా.. మంగళవారం ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

Also Read: Stalin Accident Scheme: రోడ్ యాక్సిడెంట్ బాధితులకు సహాయం చేస్తే రూ.5 వేల బహుమానం!

ALso Read: Pushkar Singh Dhami: ఓడినా పుష్కర్ సింగ్ ధామికే పగ్గాలు... రెండోసారి సీఎంగా ఛాన్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్

Trending News