Delhi Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఢిల్లీని ఆనుకుని ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నొయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో భూమి 5 సెకన్లపాటు కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.4 మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టుగా నమోదైంది. నేపాల్ లో 10 కిమీ లోతున భూకంపం కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఐదు రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో భూకంపం రావడం ఇది రెండోసారి. గత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేపాల్ లో 6.3 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతో భూకంపం సంభవించిన సమయంలోనూ ఢిల్లీలో భూమి కంపించిన విషయం తెలిసిందే. 



 


ఇదిలాఉంటే ఢిల్లీకి భూకంపాలు కొత్త కాదనే విషయం విదితమే. ఒక ఘటన మరువక ముందే మరొ ఘటన అన్నరీతిలో 'ఢిల్లీలో భూకంపం' తరచుగా వార్తల్లో ఉంటూనే ఉంటుంది. వరుస భూకంపాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్ వాసులను వెంటాడుతోంది. అప్ఘనిస్ఖాన్, పాకిస్థాన్ మొదలు నేపాల్ ( Science Behind Earthquakes ) వరకు ఎప్పుడు, ఎక్కడ భూకంపం సంభవించినా.. ఆయా భూకంపాల ప్రభావంతో ఢిల్లీలోనూ భూమి కంపిస్తుండటం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. 


Also Read : Pawan Kalyan at Rushikonda: పవన్ కళ్యాణ్ రుషికొండ బీచ్‌‌కి వెళ్లింది అందుకేనా ?


Also Read : Case filed on Pawan: కొంప ముంచిన షో ఆఫ్.. కారెక్కిన పవన్ కళ్యాణ్ మీద కేసు?


Also Read : AP CM YS Jagan Speech: సహాయం అందిస్తే..ప్రజలు మిమ్మల్ని సదా గుర్తుంచుకుంటారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook