Delhi Fire Accident Tragedy: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 26కి చేరిన మృతుల సంఖ్య.. 12 మందికి గాయాలు
Delhi Fire Accident Updates: ఢిల్లీలోని ముండ్క మెట్రో స్టేషన్‌కి సమీపంలోని భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 26 కి చేరింది. మరో 12 మందికి తీవ్రంగా గాయాలైనట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఇప్పటివరకు 26 మంది మృతదేహాలు వెలికి తీశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Delhi Fire Accident Updates: ఢిల్లీలోని ముండ్క మెట్రో స్టేషన్‌కి సమీపంలోని భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 26 కి చేరింది. మరో 12 మందికి తీవ్రంగా గాయాలైనట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఇప్పటివరకు 26 మంది మృతదేహాలు వెలికి తీశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారని.. సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డిప్యూటీ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌదరి వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించినట్టు సునీల్ చౌదరి పేర్కొన్నారు.
ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. భవనంలోని మెుదటి అంతస్థులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల కార్యాలయంలో అంటుకున్న మంటలు భవనం మొత్తానికి వ్యాపించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ అగ్ని ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనపై ట్విటర్ ద్వారా స్పందించిన రాష్ట్రపతి... క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ముండ్క మెట్రో స్టేషన్‌కి సమీపంలోని 544 నెంబర్ పిల్లర్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ఈ ఘోర అగ్రి ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు తన సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ (PM Narendra Modi).. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి త్వరగా నయమవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదం ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన అమిత్ షా.. అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నట్టు తెలిపారు. సహాయ కార్యక్రమాలపై ఆరా తీస్తున్నానన్న అమిత్ షా.. భవనాన్ని ఖాళి చేయించి క్షతగాత్రులకు తక్షణమే సహాయం అందేలా చూడటమే ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం అని ట్వీట్ చేశారు.
Also read : Jammu Kashmir Bus Fire: వైష్ణోదేవి భక్తులతో వెళుతున్న బస్సులో మంటలు..నలుగురు మృతి
Also read : Bomb at Pune Railway Station: పుణె రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద వస్తువు.. రైళ్లు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook