Bomb at Pune Railway Station: పుణె రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద వస్తువు.. రైళ్లు రద్దు

Bomb at Pune Railway Station: పుణె రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద వస్తువు కలకలం రేపింది. అది బాంబును పోలి ఉండటంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బాంబు డెటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు రైల్వే స్టేషన్‌ను ఖాళీ చేయించారు. రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది.

Last Updated : May 13, 2022, 07:58 PM IST
  • పుణె రైల్వే స్టేషన్‌లో బాంబును పోలిన వస్తువు
  • రైల్వే స్టేషన్‌ను ఖాళీ చేయించిన అధికారులు
  • రైళ్ల రాకపోకలకు అంతరాయం
Bomb at Pune Railway Station: పుణె రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పద వస్తువు.. రైళ్లు రద్దు

Bomb at Pune Railway Station: పుణె రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద వస్తువు కలకలం రేపింది. అది బాంబును పోలి ఉండటంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బాంబు డెటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు రైల్వే స్టేషన్‌ను ఖాళీ చేయించారు. రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది.

రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్‌ దగ్గర ఈ అనుమానాస్పద వస్తువు కనిపించడంతో దాన్ని గుర్తించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అప్రమత్తమైంది. వెంటనే బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి ఆ వస్తువు ఏంటన్నది పరిశీలించారు.

మూడు బాణసంచా ట్యూబ్‌లను దగ్గరగా కట్టి దానికి వైర్ అనుసంధానం చేసి ఉంది. అక్కడికి ఆ వస్తువు ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

అయితే అందులో డిటోనేటర్ కానీ పేలుడు పదార్థాలు కానీ లేవని గుర్తించారు. పుణె రైల్వే స్టేషన్‌లో లభ్యమైన వస్తువు జెలిటిన్ కాదని బాంబ్ స్క్వాడ్ స్పష్టం చేసింది. ఆ వస్తువులు స్వాధీనం చేసుకుని బాంబ్ స్క్వాడ్ నిశితంగా పరిశీలించిందనీ... తర్వాత నిర్వీర్యం చేసినట్లు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ సదానంద్ వేస్ పాటిల్ వెల్లడించారు.

ఇదే తరహా ఘటన గురువారం ఉరన్‌లో చోటు చేసుకుంది. కిగావ్ బీచ్‌ దగ్గర అనుమానాస్పద వస్తువులు దొరికాయంటూ సమాచారం రావడంతో భారీ సంఖ్యలో జనం అక్కడికి చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మండే స్వభావం ఉన్న కొన్ని పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ గన్‌తో గాల్లో వీటిని పేలిస్తే వెలుగు వస్తుందని చెబుతున్నారు. ఎవరికైనా సంకేతం ఇవ్వడానికి వీటిని వాడతారని పోలీసులు చెబుతున్నారు. అయితే బీచ్‌ దగ్గరకు అవి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read: Zee Founder Subash Chandra: టెక్నాలజీకి మనుషులతో లోతైన అనుబంధం ఉంది: ఎంపీ సుభాష్ చంద్ర

Also Read: Sunny Leone Birthday: సన్నీ లియోనీ బర్త్ డే స్పెషల్.. సన్నీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News