Delhi Gang Rape: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దారుణం.. 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్.. బర్త్ డే పేరుతో పిలిచి..
Delhi Gang Rape: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. రైల్వే స్టేషన్‌లోని ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ గదిలో మహిళపై ఈ అఘాయిత్యం జరిగింది.
Delhi Gang Rape: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. రైల్వే స్టేషన్‌లోని 8-9 ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ నిర్వహణ సిబ్బంది ఉండే గదిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గురువారం (జూలై 21) అర్ధరాత్రి దాటాక 2.27 గం. సమయంలో బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసింది. తనపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని సమాచారమిచ్చింది. దీంతో వెంటనే పోలీసులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకుని బాధితురాలిని కలిశారు. ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఆమె నివసిస్తోంది. భర్తతో విడిపోయిన ఆమెకు రెండేళ్ల క్రితం సతీశ్ కుమార్ అనే రైల్వే ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆమెకు రైల్వే శాఖలో జాబ్ ఇప్పిస్తానని సతీశ్ నమ్మించాడు. దీంతో కొన్నాళ్లుగా ఇద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం ఆమెకు ఫోన్ చేసిన సతీశ్.. తన కొడుకు బర్త్ డేకి రావాలని పిలిచాడు.
కృతీ నగర్ మెట్రో స్టేషన్‌లో ఆమెను రిసీవ్ చేసుకున్న సతీశ్ కుమార్.. అక్కడి నుంచి ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ప్లాట్‌ఫామ్ 8-9పై ఉన్న ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ సిబ్బంది గదికి ఆమెను తీసుకెళ్లాడు. ఆపై మరో వ్యక్తితో కలిసి అదే గదిలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో మరో ఇద్దరు గది బయట కాపలాగా ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సతీశ్ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది.. ఇవాళ, రేపు ఆఫర్ల జాతర.. కస్టమర్స్‌కు పండగే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook