Gang Rape: తల్లీ, ఆరేళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్.. కదులుతున్న కారులోనే కీచకపర్వం

Gang Rape : దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. మహిళల రక్షణకు నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నా అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులను కూడా వదలడం లేదు. హైదరాబాద్ లో ఓ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు యువకులు.

Written by - Srisailam | Last Updated : Jun 27, 2022, 12:07 PM IST
  • ఉత్తరాఖండ్ లో దారుణం
  • తల్లీ, ఆరేళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్
  • కదులుతున్న కారులోనే కీచకపర్వం
Gang Rape: తల్లీ, ఆరేళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్.. కదులుతున్న కారులోనే కీచకపర్వం

Gang Rape : దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. మహిళల రక్షణకు నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నా అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులను కూడా వదలడం లేదు. హైదరాబాద్ లో ఓ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు యువకులు. కారులోనే బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన జరిగింది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కూతురుపై దుండగులు అత్యాచారం చేశారు. ఉత్తరాఖండ్ లో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని రూర్కీలో మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కూతురుపై దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. హైదరాబాద్ తరహాలోనే కారులోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాధిత మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి వేళ పిరాన్ కలియార్ నుంచి ఇంటికి వెళుతోంది. అయితే మద్యలో తన కారు ఆపి వాళ్లకు లిఫ్ట్ ఇచ్చాడు సోను అనే వ్యక్తి. కొంత దూరం వెళ్లాక సోనూతో పాటు అతని స్నేహితులు మహిళతో పాటు ఆమె వెంట ఉన్న ఆరేళ్ల చిన్నారిపైనా రేప్ కు పాల్పడ్డారు.

బాధితులు కారు ఎక్కే సమయానికే అందులో మరికొందరు యువకులు ఉన్నారని పోలీసులు చెప్పారు. అందరూ కలిసి కారులోనే కీచక పర్వానికి  పాల్పడ్డారు. కారును ఒకరు డ్రైవ్ చేస్తుండగా మిగితా వారు అత్యాచారం చేశారు. గ్యాంగ్ రేప్ తర్వాత మహిళతో పాటు బాలికను కాలువ దగ్గర పడేశార దుండగులు. అర్థరాత్రి బాధిత మహిళ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన దారుణాన్ని తెలిపింది. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కారులో ఎంతమంది ఉన్నారో బాధిత మహిళ చెప్పలేకపోతుందని పోలీస్ అధికారి తెలిపారు.

Read also: Hyderabad Pubs: బడా నేతతో అండతో పబ్ లో మైనర్ల పార్టీ? గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కూడా పోలీసులు మారరా!

Read also: Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు..ఫోర్త్ వేవ్ వచ్చేసినట్టేనా?     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News