ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా సెకండ్‌వేవ్ ఇప్పుడు ఇండియాను కూడా ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. మరి ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారా..కేంద్రం ఏమంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus )సెకండ్‌వేవ్ ( Second wave ). ఇప్పుడిదే అందర్నీ కలవరపెడుతున్న అంశం. ఇప్పటికే పలు దేశాల్లో రెండోసారి లాక్‌డౌన్ విధించగా..కొన్ని దేశాల్లో పాక్షిక ఆంక్షలు విధించారు. ఇటు ఇండియాలో కూడా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పెరుగుతున్న కేసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని ( Delhi Government ) కలవరపెడుతున్నాయి.


గత పది రోజుల్నించి ఢిల్లీలో ప్రతి రోజూ 4-7 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీపావళి సీజన్, చలికాలం కావడంతో కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అప్రమత్తమయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి లాక్‌డౌన్ ( Lockdown ) విధించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm Arvind kejriwal ) ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే లాక్‌డౌన్ విధించడానికి లేదా కనీసం హాట్‌స్పాట్ ప్రాంతాల్ని సీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 


ఢిల్లీలో పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కేజ్రీవాల్ వైద్యాధికార్లతో సమీక్షించి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని..ఢిల్లీలో పాక్షికంగా లాక్‌డౌన్ విధించే ఆలోచన ఉందని చెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ ( Central Government ) అనుమతి కోరామన్నారు. కేసులు  అధికంగా నమోదవుతున్న మార్కెట్లను మూసేయాలని ఆలోచిస్తున్నామన్నారు. స్థానిక మార్కెట్‌లలో నిబంధనలు పాటించడం లేదని..ఫలితంగా అవి కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని కేజ్రీవాల్ ( Arvind kejriwal ) తెలిపారు. Also read: Bengaluru Riots Case: అల్లర్ల కేసులో మాజీ మేయర్ అరెస్ట్