Lockdown: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. లాక్‌డౌన్ విధిస్తున్న జాబితాలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ (Corona virus) కలకలం దేశాన్ని మళ్లీ వణికిస్తోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ ప్రారంభమై సరిగ్గా ఏడాది తరువాత కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్ (Three days lockdown) విధించేందుకు అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ప్రభుత్వం సిద్ధమైంది. హోలీ పండుగ నేపధ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన హోలీ ఉండటంతో, కఠిన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సిద్ధమైంది. మార్చ్ 28 నుంచి మార్చ్ 30 వరకూ లాక్‌డౌన్ విధించాలని అధికారులు సూచించారు.


ఢిల్లీలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో  4 వేల 288 కేసులు నమోదయ్యాయి. విపత్తు నిర్వహణ అథారిటీ  ఢిల్లీ కేసులపై కాసేపట్లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. సమావేశం తరువాత లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకోవచ్చు. 


Also read: CA Final Result 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ 2021 ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ మీకోసం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook