న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు విధించిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ పాటియాలా హైకోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌లో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్భయ కేసు నలుగురు దోషులలో ఒకరైన ముకేశ్  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఈ 22న నిర్భయ దోషులకు ఉరి. ఎవరీ పవన్ జల్లాద్?


ముకేశ్ తరఫు న్యాయవాది రెబెక్కా జాన్ ముకేశ్ తాజా పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న తర్వాత ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్రపతి కోవింద్‌ల ముందు తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున డెత్ వారెంట్‌పై స్టే విధించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ రాష్ట్రపతి నుంచి తనకు క్షమాభిక్ష దక్కపోయినా.. తన పిటిషన్ తిరస్కరణకు గురైన సమయం నుంచి ఉరిశిక్ష అమలుకు కనీసం 14రోజుల గడువు ఉంటుందని.. డెత్ వారెంట్‌పై స్టే కావాలని అతడి పిటిషన్‌లో ఉంది.


Also Read: రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరిన నిర్భయ నిందితుడు ముఖేష్ సింగ్


అంతకుముందు ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉరిశిక్ష అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుందని అడిషనల్ సొలిసిటర్ జనర్, ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు విరించారు. కానీ పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ సరైందని, అందులో ఏ తప్పిదం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. నిర్ణీత సమయానికి నిర్భయ దోషులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలవుతుందని తెలుస్తోంది. మరోవైపు తాజా పరిణామాలు చూస్తుంటే.. ఉరి జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..