రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నిర్భయకేసు దోషి ముఖేష్ సింగ్

ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురికి ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే . నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు.

Updated: Jan 15, 2020, 11:22 PM IST
రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నిర్భయకేసు దోషి ముఖేష్ సింగ్

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురికి ఢిల్లీ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే . నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి ముందు క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేసినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు. ముఖేష్ సింగ్ విచారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ముఖేష్ సింగ్ రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్‌ వద్ద  క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారు.  

ముఖేష్ తరపు న్యాయవాది బృందా గ్రోవర్ మాట్లాడుతూ  జనవరి 7న ఉరిశిక్షకు వారెంట్ జారీ చేసిన  ఉత్తర్వులను పక్కన పెట్టాలని కోరింది. మంగళవారం నిర్భయ నిందితుడు ముఖేష్ సింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నారని ముఖేష్ సింగ్ తరపు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..