Delhi Liquor Scam: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు షాక్, ఈసారి అరెస్ట్ తప్పదా
Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇక అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టుతో ఒక్కసారిగా కేసు వేగం పుంజుకుంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదనే సూచనలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ హైకోర్టు కూడా అదే కోణంలో ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికే చాలాసార్లు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసినా ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. రేపు అంటే శుక్రవారం మరోసారి విచారణకు హాజరుకావల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈసారి ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ను కచ్చితంగా అరెస్టు చేయవచ్చనే సందేహాలున్నాయి. దాంతో ఇవాళ అత్యవసరంగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విచారణకు తాను సిద్ధమని, అయితే అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ అభ్యర్దించారు.
జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటీషన్‌పై విచారణ జరిపి ఈ దశలో ఉపశమనం కల్పించే ప్రసక్తి లేదని తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఈడీ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22న ఉంటుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకూ 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. దాంతో ఈసారి మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. రేపు ఆయన ఈడీ విచారణకు హాజరయ్యాక అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Also read: IPL 2024 Recharge Plans: అంతరాయం లేకుండా ఐపీఎల్ చూసేందుకు అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook