Delhi IGI Airport: జర్మనీకి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం (సెప్టెంబర్ 2) 800 విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఇండియన్ ప్రయాణికులపై కూడా పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఐజీఐ) నుంచి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో జర్మనీ వెళ్లాల్సిన ప్రయాణికులు అకస్మాత్తుగా విమాన సర్వీసులు రద్దవడంతో గందరగోళానికి గురయ్యారు. దాదాపు 700 మంది ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్టులో నిరసనలకు దిగారు. భారీగా వచ్చిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులతో ఒకరకంగా ఎయిర్‌పోర్టు రైల్వే స్టేషన్‌ను తలపించిందనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ-జర్మనీ లుఫ్తాన్సా సర్వీసులు రద్దు :


ఢిల్లీ నుంచి జర్మనీలోని మ్యూనిచ్,ఫ్రాంక్‌ఫర్ట్‌లకు రాకపోకలు సాగించే లుఫ్తాన్సా 763, లుఫ్తాన్సా 761 విమానాలు శుక్రవారం రద్దయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 1.10 గంటలకు లుఫ్తాన్సా 761, 2.50 గంటలకు లుఫ్తాన్సా 763 ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమాన సర్వీసులు రద్దవడంతో అందులో ప్రయాణించాల్సిన 700 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నిరసనలకు దిగారు. విమాన టికెట్ డబ్బులు రీఫండ్ చేయాలని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.


ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీసులు మాట్లాడుతూ.. గురువారం అర్ధరాత్రి దాటాక 12.15గం. సమయంలో ఎయిర్‌పోర్ట్ నుంచి తమకు కాల్ వచ్చిందన్నారు. అక్కడ చాలామంది ప్రయాణికులు గుమిగూడి నిరసన తెలుపుతున్నట్లు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సమాచారమిచ్చారన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని నిరసన తెలుపుతున్న ప్రయాణికులను అక్కడి నుంచి పంపించేశామని చెప్పారు.


విమాన సర్వీసులు ఎందుకు రద్దయ్యాయి 


లుఫ్తాన్సా పైలట్స్ యూనియన్ వేతనాల పెంపుకు డిమాండ్ చేస్తూ శుక్రవారం సమ్మెకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 విమాన సర్వీసులు రద్దయ్యాయి. లుఫ్తాన్సాకి చెందిన 5 వేల మంది పైలట్స్‌కి 5.5 శాతం చొప్పున వేతన పెంపు చేపట్టాలని పైలట్స్ యూనియన్ ఆ సంస్థను డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌కి లుఫ్తాన్సా యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో పైలట్స్ సమ్మెకి దిగారు. 


Also Read: No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?


Also Read: Ranga Ranga Vaibhavanga Review: 'రంగ రంగ వైభవంగా' టైటిల్ కు తగినట్టుగానే ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook