Oxygen Shortage in Delhi: ఢిల్లీలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత, డాక్టర్ సహా 8 మంది మృతి
Oxygen Shortage in Delhi: దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమం కొనసాగుతోంది. ప్రాణవాయవు కోసం దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ అందక మరో 8 మంది మృతి చెందారు.
Oxygen Shortage in Delhi: దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమం కొనసాగుతోంది. ప్రాణవాయవు కోసం దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ అందక మరో 8 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా 4 లక్షల కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరత తీవ్రమౌతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. ఆక్సిజన్ అందక ఢిల్లీవాసుల ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ( Oxygen Shortage) అధికమైంది. తాజాగా ఢిల్లీ (Delhi) లోని బాత్రా ఆసుపత్రిలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆక్సిజన్ అందకపోవడంతో బాత్రా ఆసుపత్రి ( Batra Hospital)లో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు ( 8 patients died lack of oxygen) కోల్పోయారు.ఇందులో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఆర్ కే హిమాథని కూడా ఉండటం మరింత ఆందోళనకరం. ఐసీయూ(ICU)లో ఉన్న మరో 5 మంది ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలు అయిపోతున్నాయని..వెంటనే స్పందించాలని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు వేడుకున్నాయి. బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు కూడా పది నిమిషాల్లో ఆక్సిజన్ అయిపోతుందని..ఆదుకోవాలని ఓ వీడియో విడుదల చేశారు. రోగుల ప్రాణాల్ని రక్షించడంలో కీలకమైన ఆక్సిజన్ అందక (Oxygen Shortage) ఊపిరాగుతున్న ఘోర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ ట్యాంకర్ రావడంలో జరిగిన ఆలస్యంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోయారు.
Also read: Covid19 Vaccines: రెండున్నర లక్షల వ్యాక్సిన్ డోసులు...రోడ్డు పక్కన అలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook