Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం స్కాంలో కీలక పరిణామం, పరిగణలో ఈడీ ఛార్జిషీటు
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీటును కోర్టు పరిగణించింది.
ఢిల్లీ మద్యం కేసు కుంభకోణం కేసు విచారణ వేగం పుంజుకోనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణలో తీసుకుంది. విచారణకు జనవరి 5వ తేదీకు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటును ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణలో తీసుకుంది. ఇప్పుడు ఇదే కేసులో మనీ లాండరింగ్ పరిణామాల్ని విచారిస్తున్న ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును సైతం కోర్టు పరిగణలో తీసుకుంది. ఇక విచారణను జనవరి 5వ తేదీకు వాయిదా వేసింది.
ఈకేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీని మరోసారి పొడిగించింది. మరో 15 రోజుల కస్టడీ పొడిగించి జనవరి 2కు విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ 10 వేల పేజీలతో, ఈడీ 3 వేల పేజీలతో తొలి ఛార్జిషిటు దాఖలు చేశాయి. ఏడుగురిపై అభియోగాలు మోపాయి. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి సహా మరికొందరి పేర్లున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు లేకపోవడం గమనార్హం.
ఈడీ ఛార్జిషీటులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రను అరెస్టు చేసి ఇప్పటికే రెండు నెలలైంది. త్వరలో ఈడీ అనుబంధ ఛార్జిషీటు కూడా దాఖలు చేయనుంది. అటు సీబీఐ, ఇటు ఈడీ ఛార్జిషీట్లను కోర్టు పరిగణలో తీసుకోవడంతో ఈ కేసులో కీలక పరిణామాలు జరగవచ్చు.
Also read: Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి షాక్.. ఉచిత రేషన్‌కు బ్రేక్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook